Winding Actions | స‌ముద్రంలో ప‌డిపోయిన హెలికాప్టర్

Winding Actions | స‌ముద్రంలో ప‌డిపోయిన హెలికాప్టర్

ఆరుగురు మృతి..
మ‌రొక‌రు గ‌ల్లంతు
ఖతార్‌లో ఘ‌ట‌న‌

Winding Actions | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : ఖతార్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ఒక సైనిక హెలికాప్టర్ సముద్ర జలాల్లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు సిబ్బంది మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడమే ప్రమాదానికి కారణమని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఏడో వ్యక్తి కోసం కోస్ట్ గార్డ్, బోర్డర్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతా దళాలకు (లెఖ్వియా) చెందిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

Leave a Reply