మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని బట్ల కాలువకు చెందిన పులకరం వెంకన్న ఆకస్మిక మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది.శుక్రవారం ఆయన కన్నుమూయగా, శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మృత దేహానికి నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరేళ్ల సైదులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో కూడా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్వాయి చెన్నారెడ్డి, యసరాణి సైదులు, నారగోని యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
