మామడ మండలంలో రంజాన్ సందడి..

మామడ, ఆంధ్రప్రభ : మండలవ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని ఈద్గాలు, మసీదులకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఉదయాన్నే సామూహిక నమాజ్ ఆచరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ తెలుపుకున్నారు. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొనగా, మత పెద్దలు ప్రార్థనలను పర్యవేక్షించారు.

Leave a Reply