మానవత్వాన్ని చాటుకున్న పల్లగుట్ట పూర్వ విద్యార్థులు

మానవత్వాన్ని చాటుకున్న పల్లగుట్ట పూర్వ విద్యార్థులు
చిలుపూర్, ఆంధ్రప్రభ : నేటి స్వార్థపూరిత సమాజంలో స్నేహం అంటే కేవలం వేడుకలకే పరిమి తం కాదు. కష్టాల్లో తోడుండటమే నిజమైన స్నేహమని చిలుపూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన 2002-03 పదోవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు నిరూపిస్తున్నారు. తమ సహచరుల కుటుంబాల్లో వరుసగా చోటుచేసుకున్న విషాద సంఘటనల్లో మేమున్నామంటూ అండగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇటీవల భాషబో యిన శ్రీనివాస్ తండ్రి మరణించగా, స్నేహితులందరూ కలిసి కుటుం బాన్ని పరామర్శించి ఒక్కొక్కరు రూ.500 చొప్పున మొత్తం రూ.11,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే మిత్రుడు శేరి శ్రీధర్ పితృ వియోగం చెందినప్పుడు, గోవిందు రమేష్ మాతృవియోగం చెందిన సందర్భాల్లో కూడా స్నేహితులందరూ ఐక్యంగా స్పందించి వారి కుటుం బాలకు ఆర్థికంగా మానసికంగా ధైర్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుఖాల్లో అందరూ ఉంటారు కానీ కష్టాల్లో తోడు నిలవడమే నిజమైన స్నేహం.. పల్లగుట్ట పాఠశాలలో కలిసిన అనుబం ధంతో మేమంతా ఒక కుటుంబంలా ఎప్పుడూ ఒకరికొకరం అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాల్నే నాగరాజు, చిర్ర సుమన్, బెల్లి అమరేందర్, చిర్ర యాకరాజు, శివరాత్రి స్వామి, కుంచాల సోను రాజు, శేరి శ్రీధర్, ఇసురం సురేష్, కొసల రామ్ రెడ్డి, కొయ్యడ సురేష్, వేల్పుల పరమేశ్వర్, హైదరాబాద్ రాజు, నంద కుమార్, వేల్పు ల రవీందర్, దార అశోక్, ముక్కెర శ్రీశైలం, గోవిందు రమేష్, సంగు రాములు, గంగారపు అశోక్, భాస్కర్, బత్తిని సంపత్, గంగారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
