జవహర్ నవోదయ పరీక్షలో విద్యార్థిని ఎంపిక..

జవహర్ నవోదయ పరీక్షలో విద్యార్థిని ఎంపిక..

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణానికి చెందిన విజయ హై స్కూల్ విద్యార్థి తోట ఆరుష్ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (జే.ఎన్.వి.ఎస్.టీ) 2026లో 95 మార్కులు సాధించి నిజామాబాద్ జిల్లాలో 2వ ర్యాంక్‌ను సాధించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఆరుష్ సాధించిన ర్యాంక్ ఈ విజయం అతని కృషి, పట్టుదల, పాఠశాల అందించిన మంచి విద్యా పునాది ఫలితంగా నిలిచింది.ఈ ఘనతతో పాఠశాలకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చాడు. ఇతని విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది.ఈ సందర్భంగా విజయ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ సంతపురి చంద్రశేఖర్ ఆరుష్‌ విద్యార్థికి స్వీట్ తెంపించి ఘనంగా శాలువా పూలమాలతో సత్కరించారు.

పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అతనిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానో పాధ్యాయులు మాట్లాడుతూ, ఆరుష్ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులను అభినందించారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు పాఠశాల ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.విజయ హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తోట ఆరుష్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అతని భవిష్యత్తు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply