తమ్ముడిపై అపారమైన ప్రేమ….

తమ్ముడిపై అపారమైన ప్రేమ….

చేతుల పై టాటుల తో జ్ఞాపకం.

రాయపోల్, ఆంధ్రప్రభ : అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో చాటిచెప్పిన హృదయాన్ని హత్తుకునే ఘటన రాయపోల్ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బూరుగుల ఆనందరావు (నందు),తన తమ్ముడు అక్షయ్ రెండు సంవత్సరాల క్రితం మరణించాడు.తమ్ముడి మరణం జీర్ణించుకోలేక అతని జ్ఞాపకాన్ని జీవితాంతం నిలుపుకోవాలని భావించాడు.

తమ్ముడిపై ఉన్న అపారమైన ప్రేమను చాటుతూ, ఎడమ చేతిపై అక్షయ్ చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకోగా, కుడి చేతిపై అతని పేరును టాటూగా పొడిపించుకున్నాడు. తమ్ముడిని ఎంతగా ప్రేమించాడో ఈ టాటూలే స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తమ్ముడి జ్ఞాపకాలను హృదయంలో దాచుకున్న నందు, వాటిని తన శరీరంపై కూడా నిలుపుకోవడం గ్రామస్థులను భావోద్వేగానికి గురిచేసింది. అన్నదమ్ముల మధ్య ఉన్న బంధం ఎప్పటికీ చెదరదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Leave a Reply