55 skill courses : జాబ్ గ్యారెంటీ ప్లాన్ Andhra Prabha Prabha SPL Story

55 skill courses : జాబ్ గ్యారెంటీ ప్లాన్ Andhra Prabha Prabha SPL Story
- 55 స్కిల్ కోర్సులు రెడీ
- రూ.40 వేల కోర్సు ఫ్రీ
- డిగ్రీ కాదు .. స్కిల్ ముఖ్యం..
- ఏపీ సర్కార్ సూపర్ ప్లాన్
- గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో ట్రైనింగ్..
- స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్
- ఏపీ స్కిల్ కోర్సులు హాట్ టాపిక్
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో)
వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో కేవలం డిగ్రీ పట్టా ఉంటే సరిపోదు. నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే మార్కుల కంటే ఆలోచనా సామర్థ్యానికి, నైపుణ్యాలకే పరిశ్రమలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వినూత్న కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే లక్ష్యంతో వివిధ రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది.
55 skill courses: నైపుణ్య తరగతులు

రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 10 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్లు, 6 సీఎం ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి 55 రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. విస్తృత స్థాయి లో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా చాలా కళాశాలల్లోని ఎంతో మంది డిగ్రీ విద్యార్థులకు, ఇంజనీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులకు ఈ శిక్షణ అందించారు. స్కిల్ హబ్స్. లో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీని అందుబాటులోకి తెచ్చారు అధునాతన కోర్సుల్లో ఉచితంగా శిక్షణ బయట మార్కెట్లో వేల రూపాయలు ఖర్చయ్యే కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ప్రధాన విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో శిక్షణ ఇస్తున్నారు.
55 skill courses : విద్యార్థుల ఆసక్తి

ఆటోకాడ్, క్యాడ్ వంటి కోర్సులు బయట నేర్చుకోవాలంటే ఒక్కో దానికి రూ.40,000 వరకు ఖర్చవుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉచితంగా, ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో నేర్పిస్తోంది అని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ విధానంతో నైపుణ్యం మరింత పెరిగి భవిష్యత్తు అవసరాలకు తగినంతగా శిక్షణ పొందుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
55 skill courses : పరిశ్రమలతో అనుసంధానం..

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి ఈ కోర్సులను రూపొందించారు. కేవలం థియరీ మాత్రమే కాకుండా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రాజెక్ట్ ఆధారిత శిక్షణ ఇస్తున్నారు. పరిశ్రమలు – విద్యాసంస్థల మధ్య వారధి విశ్వవిద్యాలయాల సిలబస్‌కు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ కోర్సుల ముఖ్య ఉద్దేశం. బయట నుంచి వచ్చే నిపుణులు విద్యార్థులకు చిప్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ వంటి అధునాతన అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహించి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
55 skill courses : అందిపుచ్చుకోండి

ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులు ఏపీఎస్ఎస్డిసి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. 30 నుంచి 90 రోజుల పాటు సాగే ఈ స్వల్పకాలిక కోర్సుల ద్వారా విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం బాటలు వేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు.
