ఎమ్మెల్యే శ్రీహరి, చైర్మన్ శ్రీధర్‌రావుకు జ్ఞాపిక

చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఐదవ పర్యాయం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన పొట్లపల్లి శ్రీధర్ రావు తో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభిమాని రంగు రమేష్ గౌడ్ ఎమ్మెల్యే శ్రీహరితో పాటు చైర్మన్ శ్రీధర్ రావులకు ఇరువురు కలిసి ఉన్న ఫోటో చిత్రాన్ని గుర్తింపుగా సమావేశంలో వారికి అందించారు రమేష్ అందించిన జ్ఞాపికను చూసిన వారు ఆయనను అభినందించారు. ఈ చిత్రపటం సమావేశంలో ఆకర్షణీయంగా మారింది.
