Indrakeeladri | దుర్గగుడి అన్నదానానికి భక్తుడి విరాళం..

Indrakeeladri | దుర్గగుడి అన్నదానానికి భక్తుడి విరాళం..

రూ.1,01,116 చెక్కును ఆలయ చైర్మన్‌కు అందజేసిన చింత ఆంజనేయులు..

Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి గాంధీనగర్ హనుమాన్‌పేటకు చెందిన చింత ఆంజనేయులు విరాళం అందజేశారు. శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పేరు మీద రూ.1,01,116 విరాళాన్ని సమర్పించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కు స్వయంగా అందజేశారు.

ఆలయ సేవా కార్యక్రమాలలో ముఖ్యమైన అన్నదానానికి తనవంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని ఆంజనేయులు తెలిపారు. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు, చైర్మన్ రాధాకృష్ణకు సన్నిహితులుగా ఉండగా, భక్తి భావంతో ఈ విరాళాన్ని అందజేసి ఆలయ సేవలో భాగస్వాములయ్యారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం రసీదును అందజేశారు.

Leave a Reply