విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యం…

విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యం…
ప్రగతి ప్రణాళిక ర్యాలీ ని ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్మన్ స్వప్న సోమనర్సయ్య
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలోని విలీన గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా సోమవారం కొండగడప 3,4 వార్డుల లో నిర్వహించిన ర్యాలీని మున్సిపల్ చైర్మన్ స్వప్న స్వయంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామస్తుల తో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వార్డ్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండా శోభ సోoమల్లు, సుల్తాన్ స్వామి, మున్సిపల్ కమీషనర్ కె సతీష్ ,ఏ ఎస్ ఐ శ్రీనివాసరావు, గ్రామ ప్రజలు, మున్సిపల్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
