అంగరంగ వైభవంగా అగ్ని గుండాల మహోత్సవం…

అంగరంగ వైభవంగా అగ్ని గుండాల మహోత్సవం…

పూర్ణకుంభంతో ఎమ్మెల్యే మందుల సామెల్ కి స్వాగతం
ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు సన్మానం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఉదయం ఆలయం ఎదుట నిర్వహించిన అగ్ని గుండాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి వారిని పల్లకిలో ఊరేగింపు గా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు, మహిళలు, వ్యాపారులు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చారు.ఈ కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే సామెల్ కి స్వాగతం పలికారు. అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం గెలుపు కార్యక్రమం నిర్వహించారు.

ఆలయంలో ఎమ్మెల్యే సామెల్ ప్రత్యేక పూజలు నిర్వహించగా,ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుండగొని రామచంద్రు గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సామెల్ ను శాలువతో సన్మానించి, మెమోంటో అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న,కూర్మిళ్ల ప్రమీల,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బుర్ర యాదయ్య,బీసు యాదగిరి, బయ్యని రాజు,డి అరవింద్ రాయుడు, పట్టురి అంజయ్య,గనగాని నర్సింహా,గుండు శ్రీను,మందుల సురేష్, కోమటి జనార్దన్,బందెల రవి, ఏ ఎస్ ఐ లు వెంకన్న,శ్రీనివాస్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply