ఆదర్శ గ్రామంగా..

ఆదర్శ గ్రామంగా..

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : రానున్న రోజుల్లో నారాయణపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని.. అభివృద్ధిలో గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, పందుల యాదగిరి గౌడ్, సూరపల్లి వెంకటేష్, కట్ల వనజ భాస్కరాచారి, సభావత రఘునాయక్, సింగం బిక్షపతి, దూసర్ల శివసాగర్, చిలుకూరు అంజయ్య, చిలుకూరి శ్రీనివాస్, దోర్నాల బిక్షపతి, ఉప్పల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply