vijay, rashmika| హైదరాబాద్‌లో విరోష్ రిసెప్షన్

vijay, rashmika| హైదరాబాద్‌లో విరోష్ రిసెప్షన్
మార్చి 4న తాజ్ కృష్ణా హోటల్లో వేడుక
సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభం
గెస్ట్‌లకు ‘వన్ టైమ్ యూజబుల్ క్యూఆర్ కోడ్’ సెండ్ చేశారు
కోడ్ కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక రేపు (మార్చి 4న) హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో వైభవంగా జరగనుంది. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ఆహ్వానం ఉన్న అతిథులను మాత్రమే ఈ వేడుకకు అనుమతించనున్నారు. లోపలికి ప్రవేశించేందుకు వీలుగా గెస్ట్లందరికీ ప్రత్యేకంగా ‘వన్ టైమ్ యూజబుల్ క్యూఆర్ కోడ్’ (One-time Usable QR Code) ను పంపించారు. అయితే ఈ క్యూఆర్ కోడ్ సంప్రదాయం బాలీవుడ్లో ఉండేది. ఇప్పుడు ఇది టాలీవుడ్‌కు కూడా పాకింది.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే..
ఈ కోడ్‌ను ఎంట్రెన్స్ వద్ద స్కాన్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఈ క్యూఆర్ కోడ్ కేవలం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. ఆహ్వాన పత్రిక, క్యూఆర్ కోడ్ లేని వారు దయచేసి రిసెప్షన్ ప్రాంగణానికి రావొద్దని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ వేడుక పూర్తిగా పోలీసుల కట్టుదిట్టమైన నిఘాలో జరుగుతుందని, ఎవరూ అనధికారికంగా లోపలికి వచ్చే ప్రయత్నం చేయవద్దని, అభిమానులు ఈ నిబంధనలను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.

వీవీఐపీల రాక
ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన వీవీఐపీలు హాజరుకానున్నట్లు సమాచారం. వివాహ వేడుక ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, రిసెప్షన్ ఫోటోలు కూడా త్వరలోనే వైరల్ అవుతాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ‘విరోష్’ రిసెప్షన్ టాలీవుడ్లో మరో గ్రాండ్ ఈవెంట్‌గా నిలవనుంది. హైటెక్ సెక్యూరిటీ మధ్య జరగనున్న ఈ వేడుకపై సినీ ప్రపంచం అంతా దృష్టిసారించింది.

ఇటీవలి కాలంలో సెలబ్రిటీ పెళ్లిళ్లలో ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, టాలీవుడ్లో ఒక రిసెప్షన్‌కు ఈ స్థాయిలో క్యూఆర్ కోడ్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావొచ్చని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి. ఈ టెక్నాలజీ ద్వారా ‘గేట్క్రాషర్స్’ను అడ్డుకోవడం సులభమవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ పద్ధతి ఎక్కువగా బాలీవుడ్లో ఉండేది. అయితే సెల్రబిటీలు ఎందుకు పెళ్లిళ్లు గోప్యంగా ఎందుకు చేసుకుంటున్నారు అనే చర్చ సాగుతోంది. సెలబ్రెటీలకు సంబంధించిన వివాహాల వీడియోలు కొందరు ఓటీటీలకు అమ్ముకోవడానికే ఇలా రహస్యంగా, ఎవరినీ అనుమతించకుంగా మ్యారెజెస్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

