రాజయ్య.. తస్మాత్ జాగ్రత్త!

రాజయ్య.. తస్మాత్ జాగ్రత్త!
కడియం కుటుంబంపై విమర్శలు చేస్తే సహించం
-పదేళ్లలో నియోజకవర్గానికి అపకీర్తి తెచ్చావ్?
-కడియం అభివృద్ధి జోరు చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నావు
-నిన్ను బీఆర్ఎస్ వినియోగించుకుంటోందని ప్రజలు స్పష్టంగా గుర్తించారు
-సొంత గ్రామంలో సీట్లు గెలవలేని వ్యక్తివి నువ్వు
-బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోయినా విమర్శలు చేయడం సిగ్గుచేటు.
-జీఓల ద్వారా గతంలోనే వాస్తవాలను బయటపెట్టాం.
-అభివృద్ధి పథంలో ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
జనగామ జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారజోడు రాంబాబు
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమ వారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారజోడు రాంబా బు హాజరై మాట్లాడారు. కడియం నాయకత్వంలో సభ్యతతో సేవలు అందిస్తున్నామని తెలిపారు..మీరు మారాలి, మీ మనుషులు మారా లి..కడియం శ్రీహరి పట్ల ఉన్న అక్కసును తొలగించాలని సూచించారు. రాష్ట్ర నాయకత్వం మీ గురించి ఆలోచించడం లేదు. నియోజకవర్గంపై పెత్తనం చేస్తూ మీకు మద్దతు ఇస్తున్నట్లు భావించడం తప్పుడు అని అన్నారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే నియోజకవర్గానికి అప కీర్తి తెచ్చారు. అవినీతి ఆరోపణలు, వివాదాలతో పేరు తెచ్చుకు న్నారని విమర్శించారు. కడియాన్ని తట్టుకోలేక కేవలం విమర్శలు చేయడానికి రాజయ్యను బీఆర్ఎస్ పెద్దలు ఉపయోగించుకుంటు న్నారని ఆరోపించారు.
మీరు చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదు. మిమ్మ ల్ని నమ్మలేదు. కేవలం కడియం శ్రీహరిని విమర్శించేందుకు వినియోగిం చుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించాలని వ్యాఖ్యానించారు. సొంత గ్రామంలో గెలవలేని వ్యక్తి కడియాన్ని విమర్శించడం సరికాదన్నారు. మీరు విమర్శలు చేసినప్పుడల్లా ప్రజలు కడియంకే మద్దతు ఇచ్చారు. సర్పం చ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ బోగస్ ప్రచారం చేసినా ప్రజలు నిజాన్ని గుర్తించారనీ పేర్కొన్నారు. నాయకత్వంలో నైతిక విలువలు ఉండాలని, వ్యక్తిగత దూషణలు మానుకోవాలని సూచించారు. మద్యం సేవించి మాట్లాడుతున్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. అధిష్టానం కూడా పట్టించుకోకపోతే ప్రజల ఓట్లతో మార్పు రాకపోవడం విచారకరమన్నారు..100 పడకల ఆసుపత్రి, మున్సిపాలిటీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వం జారీ చేసిన జీఓల ప్రకారం వాస్తవాలను ప్రజల ముందు, మీడియా ముందు చూపించామని పేర్కొన్నారు.
గత పదేళ్లలో నియోజకవర్గ పరువు తీసారని, ఇకపై కడియం శ్రీహరి అభి వృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.1700 కోట్లు తెచ్చినట్లు, మరో రూ.50 కోట్లు తీసుకురా వడానికి ప్రకటన తీసుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో నైతిక విలు వలు పాటించాలని, బీఆర్ఎస్ నాయకులు రాజయ్యను కూలీలాగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కడియం కుటుంబంపై లేదా కడియంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరిం చారు. కడియం తల్లిని ఏమైనా అంటే మా అందరి తల్లులను అన్నట్టే భావి స్తాం. తాను ఊపిరి ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చు కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కుట్ర పూరిత చర్యలు మానుకోవాలి. లేనిపక్షంలో ప్రజలే సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
-సొంత మనుషుల వద్ద పదవులు అమ్ముకునే వ్యక్తి రాజయ్య : మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్
సొంత పార్టీలోనే సొంత మనుషుల వద్ద పదవులు, పథకాలు అమ్ముకు న్న ఘనత రాజయ్యకే దక్కుతుందని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సిగ్గు, శరం లేకుం డా మాట్లాడే నాయకుడు రాజయ్య అని పేర్కొన్నారు.. పాత కాంగ్రెస్ పార్టీ మొత్తం తనదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజకీ యాల్లో ఉన్నప్పుడు విలువలతో మాట్లాడాలన్నారు..ఎప్పటికప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. ఎమ్మెల్యేపై అనవసర ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపా ధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ నాయకులు బూర్ల శంకర్, కొలిపాక సతీష్, నాగరబోయిన శ్రీరాములు, గట్టు రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సి లర్ లు సంపత్ రాజు, హరినాథ్, లక్ష్మి, హైమ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
