విశ్రాంతి భవనాలను తిరిగి అందుబాటులోకి తేవాలి…

విశ్రాంతి భవనాలను తిరిగి అందుబాటులోకి తేవాలి…
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాలను తిరిగి అందుబాటులోకి తేవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ కు కృష్ణా జిల్లా బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రమణ్యం సోమవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం సుబ్రమణ్యం మాట్లాడుతూ… సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో రోగులతో పాటు వచ్చిన వారు, గర్భిణీ స్త్రీల విశ్రాంతి కోసం రోటరీ క్లబ్ వారు, గత రాజ్యసభ సభ్యులు చిరంజీవి 20 లక్షల రూపాయల నిధులతో భవంతులను ఏర్పాటుచేయడం చేయడం జరిగిందన్నారు.
సంబంధిత భవనాలను ప్రజల సౌకర్యార్థం కాకుండా ఆస్పత్రి యూనియన్, రక్త పరీక్షల కోసం వినియోగిస్తుండటం బాధాకరమన్నారు. దింతో రోగులతో పాటు వచ్చిన వారు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియక చెట్ల కింద సేద తీరుతూ, బయట రోడ్ల వెంబడి కాలం వెల్లదీస్తున్నారని సుబ్రమణ్యం వివరించారు. పైన పేర్కొన్న సమస్యలపై తక్షణ చర్యల కోసం బీ.సీ సంక్షేమ సంఘం తరఫున జాయింట్ కలెక్టర్ నవీన్ కి వినతిపత్రం సమర్పించడం జరిగిందని శేకుబోయిన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన్ను గోవిందు, భోగి రెడ్డి సుభాని, సి.హెచ్ కోటేశ్వరరావు, ఎం.పవన్ తదితర బి.సి నాయకులు పాల్గొన్నారు.
