ఘనంగా దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు….

ఘనంగా దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు….

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వసంత లక్ష్మి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ … ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి వి సునీత, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ శశిధర్, నరసింహ, గ్రామపంచాయతీ సిబ్బంది యాదయ్య పాల్గొన్నారు.

Leave a Reply