కట్టమల్లన్న స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

కట్టమల్లన్న స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా 

  • ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

కరీమాబాద్, ఆంధ్రప్రభ : చారిత్రాత్మక కీర్తి నగర్ లోని శ్రీ కట్ట మల్లన్న ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. కట్ట మల్లన్న స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య దంపతులు దర్శించుకున్నారు.కట్ట మల్లన్న జాతర లో భాగంగా దేవాలయంలో బోనం, పట్నం భారీగా భక్తులు సమర్పించుకుంటారు. ఎమ్మెల్సీ దంపతులు దేవాలయాని సందర్శించిగా ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు.

శ్రీ కట్ట మల్లన్న స్వామికి (మల్లికార్జున స్వామి) ఎమ్మెల్సీ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీకి ఆలయ పూజారులు విజ్ఞప్తి చేయగా స్పందించిన బసవరాజు సారయ్య అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారని పూజారులు తెలిపారు.ఆలయ పూజారులు ఎమ్మెల్సీ సారయ్యను స్వామి వారి కండువా కప్పి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పూజారులు పెద్దకట్టయ్య, చిన్న కట్టయ్య, యాదగిరి, ఒగ్గు పూజారులు ఆలయ సిబ్బంది ఆడెపు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply