నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపాలి..

నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపాలి..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దేవులమ్మ నాగారం గ్రామపంచాయతీ నిధులలో జరిగిన అవకతవకల పై విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఫిర్యాదు చేశారు.

గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో గ్రామపంచాయతీ నిధులకు సంబంధించిన లెక్కలను అధికారులు చూపించలేకపోయారని, నిధులలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నందు వల్లనే సరిగ్గా లెక్కలను చూపించలేక పోయారని, గ్రామపంచాయతీలో గత రెండు సంవత్సరాలుగా నిర్వహించిన ఆర్థిక లావాదేవీల పై, అనుమతులు లేకుండా చేపట్టిన ఇండ్ల నిర్మాణాల పై విచారణ జరిపించాలని, ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలను వెల్లడించాలని, దీని పై అధికారులు వెంటనే విచారణ జరిపించి గ్రామపంచాయతీ నిధులను కాపాడాలని వారు కోరారు.

Leave a Reply