Liquor | ఆమ్ ఆద్మీ నేత‌ల‌కు ఊర‌ట

Liquor | ఆమ్ ఆద్మీ నేత‌ల‌కు ఊర‌ట

ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసు కొట్టేసిన ఢిల్లీ కోర్టు
ఆధారాల్లేవ‌ని తేల్చిన కోర్టు
ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాకు ఉప‌శ‌మ‌నం

ఆంధ్ర‌ప్ర‌భ, ఢిల్లీ : ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసు నుంచి ఆమ్ ఆద్మీ నేత‌ల‌కు ఊర‌ట ల‌భించింది. ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాపై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను ఢిల్లీ కోర్టు ఇవాళ కొట్టిపారేసింది. మ‌ద్యం విధానాన్ని రూపొందించే క్ర‌మంలో అవినీతి జ‌రిగిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని ఢిల్లీ కోర్టు వెల్ల‌డించింది. ఎక్సైజ్ పాల‌సీ రూప‌క‌ల్ప‌న‌లో ఎటువంటి కుట్ర , నేర‌పూరిత ఉద్దేశం కానీ లేద‌ని ఢిల్లీ కోర్టు తేల్చింది. కేజ్రీవాల్‌, సిసోడియాపై ఆధారాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంలో ప్రాసిక్యూష‌న్ విఫ‌ల‌మైన‌ట్లు కోర్టు తెలిపింది. వీరితో పాటు 23 మంది నిందితులను విముక్తి చేసింది.

Liquor
Liquor

సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ తీర్పునిచ్చారు. కేజ్రీవాల్‌, మణీష్ సిసోడియాపై కేసు నిలబడే ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్‌పై కూడా స్పష్టమైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో మనీష్ సిసోడియా సుమారు 530 రోజులు జైలులో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సుమారు 156 రోజులు జైలులో గడిపారు. 2021 ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలతో సీబీఐ, ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది.

ఆ 23 మంది వీరే…


1)కులదీప్ సింగ్
2) నరేందర్ సింగ్
3) విజయ్ నాయర్
4) అభిషేక్ బోయిన్పల్లి
5) అరుణ్ రామచంద్ర పిళ్లై
6) ముత్త గౌతం
7) సమీర్ మహేంద్రుడు
8) మనీష్ సిసోడియా
9) అమన్‌దీప్ సింగ్ ధాల్
10) అర్జున్ పాండే
11) బుచ్చిబాబు గోరంట్ల
12) రాజేష్ జోషి
13) దామోదర్ ప్రసాద్ శర్మ
14) ప్రిన్స్ కుమార్
15) అరవింద్ కుమార్ సింగ్
16) చన్‌ప్రీత్ సింగ్ రాయత్
17) కవిత
18) అరవింద్ కేజ్రీవాల్
19) దుర్గేష్ పాఠక్
20) అమిత్ అరోరా
21) వినోద్ చౌహాన్
22) ఆశిష్ చంద్ మాథుర్
23) శరత్ చంద్ర రెడ్డి

Leave a Reply