Station Ghanpur | రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు..

Station Ghanpur | రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన కారు..

  • దేశాయి తండా సమీపంలో ఘోర ప్రమాదం..
  • యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Station Ghanpur | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ప్రాంతంలో గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్‌పూర్ నుండి చిలుపూర్ మండలం దేశాయి తండా వైపు వెళ్తున్న షిఫ్ట్ కారు అదుపుతప్పి రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం కారు పల్టీలు కొట్టుకుంటూ రిజర్వాయర్‌లో పడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారు అద్దాలు పగలడంతో ధారావత్ చరణ్ (18) తీవ్ర గాయాలపాలయ్యాడు. అతను కారు నుంచి బయటపడి గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

Station Ghanpur

అయితే కారు నడుపుతున్న భూక్యా పవన్ ఆచూకీ తొలుత తెలియకపోవడంతో సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్ఐ రాజేష్ ఘటన స్థలానికి చేరుకుని రిజ ర్వాయర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం చేపట్టిన శోద నలో భూక్యా పవన్ మృత దేహం లభ్యమైంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదానికి గల కార ణాలు ఇంకా తెలియా ల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో దేశాయి తండా పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.

Station Ghanpur

Leave a Reply