దవాఖానకొచ్చాడు అనంత లోకానికి వెళ్ళాడు

దవాఖానకొచ్చాడు అనంత లోకానికి వెళ్ళాడు

వెల్దండ, ఆంధ్రప్రభః చారకొండ మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి, వారి భార్య ఆనారోగ్య పరిస్థితుల రీత్యా వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం తిరిగి స్వగ్రామం అప్పారెడ్డి పెళ్లికి వెళ్లే తరుణంలో వెల్దండ మండల కేంద్రంలోని కోట మైసమ్మ గుడి సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తుండగా లక్ష్మారెడ్డి అక్కడి అక్కడికి అక్కడే మృతి చెందాడు.భర్త మృతిని గమనించిన భార్య ఆర్తనాదాలు మిన్నంటాయి ఇది గమనించిన స్థానికులు మృతుని వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసి వారి స్వగ్రామానికి తరలించినట్టు తెలిపారు.

Leave a Reply