మహిళలని అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం

వెల్దండ, ఆంధ్రప్రభ : మహిళ సంక్షేమానికి పెద్దపీట వేయాలనె ద్రుడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిర మహిళ శక్తి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కుప్పగండ్ల గ్రామపంచాయతీ సమీపంలోని గొల్లపల్లి లో రెండు ఇందిరా మహిళ శక్తి భవనాలు మంజూరైన సందర్భంగా బుధవారం స్థానిక గ్రామ సర్పంచ్ మొక్తాల రమేష్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఒకే గ్రామంలో రెండు మహిళా శక్తి భవనాలు మంజూరు చేయించిన సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మ , వార్డు సభ్యులు ,దున్న సుమతమ్మ,ఆయిల్ స్వాతి శివరాజ్,ఏఈ సురేందర్ రెడ్డి ,మహిళ సంఘం సభ్యులు, నాయకులు డేరంగుల జంగయ్య, మహేష్, యాదయ్య,హుస్సేన్,శ్రీను,లక్ష్మయ్య, బాలరాజు, రాజేష్ రెడ్డి, వెంకటయ్య, ప్రభాకర్, శ్రీశైలం మరియు గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
