క్రీడా మైదానం కేటాయించాలి..

క్రీడా మైదానం కేటాయించాలి..
జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి
మెడికల్ కళాశాల స్థాపించి 13 సంవత్సరాలు గడుస్తున్నా..
ఇప్పటివరకు శాశ్వత క్రీడా మైదానం లేదు..
గ్రౌండ్ లేక విద్యార్థుల మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం….
జిజిహెచ్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులతో జూనియర్ డాక్టర్ లు..
మెడికల్ కళాశాల విద్యార్థుల నిరసన
నిజామాబాద్,ఆంధ్రప్రభ: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శాశ్వత కళాశాల మైదానం కేటా యించాలని జూనియర్ డాక్టర్లు, మెడికల్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. గ్రౌండ్ లేక విద్యార్థుల మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపు తుందన్నారు.మా సమస్య లు పరిష్క రించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిజామా బాద్ నగరం లోని జిల్లా ప్రభు త్వ జనరల్ ఆసుపత్రి ఓపి గేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులతో జూని యర్ డాక్టర్లు, మెడికల్ కళాశాల విద్యార్థులు నిరసనను వ్యక్తం చేశారు. కళాశాల మైదానం కేటా యించాలని, జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్క రించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందో ళన చేపట్టారు.
మా సమ స్య పై గతంలో పలుమార్లు ఉన్నతాధికారులకు విన్న వించిన ఇప్పటివరకు పరిష్కారం కాలేదని వాపో యారు. ఇప్పటికైనా మా సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాం డ్ చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల అసోసి యేషన్ అధ్యక్షులు డా. కార్తిక్ , జూనియర్ డాక్టర్లు మాట్లాడారు. మెడికల్ కళాశాల స్థాపించి 13 సంవత్సరాలు పూర్త య్యినప్పటికీ, ఇప్పటి వరకు శాశ్వత గ్రౌండ్ కేటాయించ కలేదని వాపో యారు. ప్రాథమిక వసతులలో భాగమైన కాలేజీ గ్రౌండ్ లేకపోవడం విద్యా ర్థుల విద్యా, క్రీడా, వ్యక్తి త్వాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోంద న్నారు. మెడికల్ విద్య అనేది అత్యంత ఒత్తిడితో కూడిన కోర్సు అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో క్రీడా మైదానం లేకపోవడం వల్ల విద్యార్థుల మానసిక ఆరో గ్యం పై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. శారీరక వ్యాయామం, క్రీడా కార్య కలాపాలు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించి మానసిక స్థైర్యాన్ని పెంపొందించ డానికి అత్యంత అవస రం అన్నారు. కాలేజీ గ్రౌండ్ కేటాయింపు విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిర క్షణకూ ఎంతో ముఖ్య మైనదని తెలిపారు. జూడ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు తమ విధులు, పోస్టింగ్స్, తరగ తులకు హాజరవుతూ నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన వ్య క్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వ త కాలేజీ గ్రౌండ్ కేటాయిం చాలని కోరారు. మా సమ స్యను వెంటనే పరిష్కరిం చకపోతే, మరింత తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిడా. జయంత్ , ఉపాధ్యక్షులుడా. సంతో ష్ , అడ్వైజర్ కమిటీడా. చంద్రకాంత్, జైన్ సెక్రె టరీలు డా. వక్వా ర్,డా. హేమంత్, డా. రవి రాథోడ్ లు మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
