ట్రాఫిక్ నియమాలపై అవగాహన

ట్రాఫిక్ నియమాలపై అవగాహన
శిరస్త్రాణం శిరోభారం కాదు
కుంటాల, ఆంధ్రప్రభ :శిరస్త్రాణం శిరోభారం కాదని కుంటాల ఎస్సై ఎం అజయ్ అన్నారు. మంగళవారం 61వ జాతీయ రహదారి పై అర్లీ ఎక్స్ రోడ్ సమీపంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అరైవ్-అలైవ్ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా నిలిచిన అర్లి ఎక్స్ రోడ్డు వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాల అవగాహన కల్పించారు. హెల్మెట్ అనేది తలకు భారం కాదు, తలను కాపాడే గొప్ప ఆయుధం అని పేర్కొన్నారు.
మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరమని దానివల్ల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు ప్రత్యేక పాటించి తమ గమ్యస్థానంలో క్షేమంగా చేరుకోవాలని ప్రజలు ప్రాణభద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ప్రారంభమైన రెండవ దశ ట్రాఫిక్ వారోత్సవాలు భాగంగా ప్రధాన రాగలరు జాతీయ రహదారులు, ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరుగుతుందని వాహనాల అతివేగంతో వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా ఆపి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ద్విచక్రమణదారులకు సూచించారు. సరైన పత్రాలు దగ్గర పెట్టుకోవాలని పత్రాలు లేక పోతే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని తప్పనిసరిగా పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

