ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటా

ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటా

  • కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న వి.కోటయ్య, బత్తిని వెంకయ్యలు అనారోగ్యంతో బాధపడుతుండగా సోమవారం కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ వారి అనుచరులతో కలిసి వారిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారి మందులకు అవసరమగు ఆర్థిక సహాయాన్ని అందజేసి వారి కుటుంబ సభ్యులకు కొండంత భరోసాను కల్పించారు. ​ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు సయ్యద్ రఫీ, సైదామేస్త్రి, మీరా, అలీ, బాబా, సలీం, షఫీ, పవన్, పొనుగుపాటి సత్యమయ్య, ఇమ్రాన్, సమీర్, నాగూల్ మీరా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply