మార్నింగ్ వాక్ లో..

మార్నింగ్ వాక్ లో..

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డ్ పాత బస్టాండ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున పారిశుద్ధ్య సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న మార్నింగ్ వాక్ లో క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెయిన్ రోడ్డు పై, ఇండ్లలో ఉన్న చెత్తా చెదారాన్ని ఏ రోజుకు ఆ రోజు తరలించి ప్రజల ఆరోగ్యాలను సంరక్షించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన చేపట్టి పారిశుద్ధ్య నివారణకు పాటుపడాలన్నారు. కార్మికులు నిత్యం ప్రధాన రోడ్లను శుభ్రపరచాలన్నారు. కార్మికుల సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

Leave a Reply