Tirumala | శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి..

Tirumala | శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి..

Tirumala, చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి “శ్రీ వెంకటేశ్వర స్వామి” ని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజామున దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు చింతల వెంకటేశ్వర రెడ్డికి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కలియుగ దైవం, సప్తగిరులవాసుడైన శ్రీ వెంకటేశ్వరస్వామిని నా జన్మదినం సందర్భంగా దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి దివ్య ఆశీస్సులు, అనుగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ లభించాలని, రాష్ట్రం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, అభివృద్ధి కలగాలని స్వామివారిని వేడుకున్నట్లుగా వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ పవిత్రమైన దర్శన భాగ్యం లభించినందుకు శ్రీవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply