గుజరాత్ : రాజ్కోట్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. నేటి ఉదయం ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగగా.. మెల్లిగా ఆ మంటలు కాస్త అపార్ట్మెంట్ మొత్తం వ్యాప్తించాయి. దీంతో ఆయా ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారంతా తట్టా.. బుట్టా వదిలేసి ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 50మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ముగ్గురు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించారు.