Karnataka | పోక్సో కేసులో మాజీ సిఎం య‌డియూర‌ప్ప‌కు ఊర‌ట

బెంగ‌ళూరు – మైన‌ర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు న్యాయస్థానం స్వల్ప ఊరట కల్పించింది. ఈ కేసులో విచార‌ణ‌కు ఈ నెల 15న హాజ‌రుకావాల‌ని కోరుతూ దీని కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు యుడియూర‌ప్ప‌కు స‌మ‌న్లు జారీ చేసింది.. దీనిపై ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు.. విచారించిన కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది. ఫాస్ట్ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై స్టే మంజూరు చేసింది.

ఇది ఇలాఉంటే , సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి గత ఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను య‌డియూర‌ప్ప‌ బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను యడియూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొంది. ఇందులో ఎటువంటి నిజాలు లేవంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *