Jeevan Reddy | ఏమైందంటే….

Jeevan Reddy | ఏమైందంటే….

Jeevan Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నేత‌ జీవన్ రెడ్డి(Jeevan Reddy) అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌ (Nimes Hospital) కు తరలించారు. జీవన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, జీవన్‌ రెడ్డి ఇటీవల కాలంగా కాంగ్రెస్ పార్టీలో కాస్త‌ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌, జీవన్‌ రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతున్న తెలిసిందే.. ఈనేప‌థ్యంలో జీవ‌న్ రెడ్డి ఒక దశలో పార్టీని కూడా వీడుతానని అలకబూనడంతో అధిష్ఠానం బుజ్జగించగా వెనక్కి తగ్గారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం తన వర్గం అభ్యర్థులును నిలబెట్టి గెలిపించుకున్నారు.

Leave a Reply