Congress | మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..

Congress | మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..
Congress, కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు నిధులు మంజూరు చేస్తూ మహిళలకు పెద్దపీట వేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు అన్నారు. కడెం మండల కేంద్రంలోని జిపివి ఓ భవనం అంగన్వాడి భవనం పెద్దూర్ తాండాలో అంబారిపేట్ గ్రామాలలో అంగన్వాడి భవనం నిర్మాణం పనులకు కడం ఎంపీడీవో కార్యాలయం ముందు సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పనులకు కడంలో ఐకెపి వివో భవనం నిర్మాణం పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులు కలిసి భూమి పూజ చేసి ఖానాపూర్ ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పేరిట ఇందిరమ్మ పథకంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ డ్వాక్రా గ్రూపులకు రుణాలు అందజేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్షమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషణ్ పెద్దూరు కడం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, అంబారీపేట గ్రామ సర్పంచ్ టి రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పి సతీష్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ భవాని, యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు టి మల్లేష్ యాదవ్, ఆకుల లచ్చన్న, బొడ్డు గంగన్న, కడెం మండల తాహసిల్దార్ ఆర్ ప్రభాకర్, ఎంపీడీవో సునీత, ఈజీఎస్ ఏపీవో జయదేవ్, ఐకెపి ఎపిఎం గంగాధర్, పి ఆర్ ఏఈ చందన్ పై జి పీ ల వార్డు సభ్యులు మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఐకెపి సీసీలు, తదితరులు పాల్గొన్నారు.
