మండల అధికారులు పాఠశాలలను తనిఖీ చేయాలి..

మండల అధికారులు పాఠశాలలను తనిఖీ చేయాలి..
బాల్కొండ, ఆంధ్రప్రభః రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని ఇందులో భాగంగా మండల స్థాయి అధికారులు రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి పద్మ సూచించారు. పాఠశాలల పనితీరుపై గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి,పారిశుద్ధ్య నిర్వహణ కోసం చేపట్టే ప్రణాళికలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వారంలో రెండు రోజులు మండల స్థాయి అధికారులు పాఠశాలలను సందర్శించి పాఠశాలల పరిస్థితులను అడిగి తెలుసుకోవాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు కృషి చేసేలా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ప్రభుత్వం మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందుతుందా ? లేదా? అని క్షుణ్ణంగా పరిశీలించలన్నారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టిక ఆహారంతో పాటు పాఠశాల పరిసరాల పరిశుభ్రత గ్రీనరీ ఎంతో అవసరమని అందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లి పాఠశాలల నిర్వహణ మెరుగుపడేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్,ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి,ఎంపీవో గంగామోహన్,సూపరిండెంట్ రమణ,మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశం,ఈజీఎస్ ఏపీవో ఇందిరా,ఐకెపి ఎపిఎం గంగారం, హౌసింగ్ ఏఈ నితీష్, తదితరులు ఉన్నారు.
