Janasena | నేడు అన్ని దారులు జ‌న‌సేనాని “విజ‌య‌కేత‌నం” స‌భ‌కే

పిఠాపురం – జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగే చిత్రాడ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అధి కారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోన్న తొలి ఆవిర్భావ సభకు పిఠాపురం మండలం వేదికగా మారడంతో అంతా పండగ వాతావరణం తలపి స్తోంది. నేడు జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ భారీ ఏర్పాట్లతో సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది తరలి రానున్న సభను జయప్రదం చేయడానికి జనసేన పార్టీ ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చే సింది. ఈ ‘జయకేతనం’ సభ దద్దరిల్లేలా ఎస్‌బీ వెంచర్స్‌ ఆవరణలో సన్నాహాలు చేసింది.

డ్రోన్లు..సీసీ కెమెరాలు..

సభను నేరుగా చూసే అవకాశం లేని వారి కోసం సభా ప్రాంగణంలో 20కిపైగా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణం బయట జాతీయ రహదారిపై ఉండిపోయే వారి కోసం కూడా ప్రత్యేకంగా స్ర్కీన్లు ఏర్పాటుచే శారు. ప్రత్యేక సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా చేసేందుకు సీసీ కెమేరాలతోపాటు డ్రోన్లతో పోలీసు శాఖ నిఘా ఉం చబోతోంది. సభా ప్రాంగణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. 10 నుంచి 15 డ్రోన్లతో సభా ప్రాంగణం, జాతీయ రహదారి, సభకు వచ్చే అన్ని మార్గాల్లో నిఘా ఏర్పాటు చేశారు. వాటిని నిరంతరాయం గమనించేందుకు కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశా రు. బందోబస్తుకు 1700 మందికి పైగా పోలీసులను ఏలూరు రేంజ్‌ పరిధిలోని ఆయా స్టేషన్ల నుంచి రప్పించారు. వీరు గురువారం సాయంత్రానికే చిత్రాడ చేరుకున్నారు. ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌, కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వాహన పార్కింగ్‌ ఇలా..

వాహనాల పార్కింగ్‌కు తొమ్మిది ప్రాంతాలు ఏర్పాటుచేశారు. కాకినాడ వైపు ఐదు, పిఠాపురం వైపు నాలుగు పార్కింగ్‌ ప్లేసులు గుర్తించారు. 216వ జాతీయరహదారిపై కాకినాడ-కత్తిపూడి మధ్య ఆవి ర్భావ సభకు వచ్చే వాహనాలు తప్ప మిగిలిన వాటి రాకపోకలను ప్రత్యామ్నాయ రహదారులపై మళ్లించారు. ఆర్టీసీ బస్సులు శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఈ మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో తిరిగేవిధంగా ఆయా మార్గాలను సూచించారు.

అదిరే..ఆతిథ్యం

ఆవిర్భావ సభకు వచ్చే జనసేన నాయకులు, అభిమానులు భోజనాలు, తాగునీరు, స్నాక్స్‌ కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విస్తృత ఏర్పాట్లుచేశారు. శుక్రవారం మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజన సదుపాయాలతోపాటు సభా ప్రాంగణంలో నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, పుచ్చకాయలు, బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ధర్మవరం కోల్ట్‌స్టోరేజీ, యానాం రోడ్డు, అన్న వరం వై జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ భోజన కౌంటర్ల పర్యవేక్షణ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు. 20కిపైగా అం బులెన్స్‌లు, ఐదు వైద్య బృందాలను అందుబాటు లో ఉంచారు. గురువారం మధ్యాహ్నానికే చిత్రా డకు వందలాదిమంది తరలివచ్చారు. వీరందరికి ఇక్కడే భోజన సదుపాయం కల్పించారు.

24ఎకరాల విస్తీర్ణంలో సభ

చిత్రాడ శివారు 24 ఎకరాల విస్తీర్ణంలో జనసేన ఆవిర్భావ సభ జయకేతనం నిర్వహిస్తున్నారు. 14 ఎకరాల విస్తీర్ణంలో ఏడు గ్యాలరీలు ఏర్పాటుచేసి రెండు మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకంటే అధికంగా వచ్చేవారు నిల్చుని సభా కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా సభా వేదికను నిర్మించారు. మూడు అంచెల్లో నిర్మించిన సభావేదిక మొదటి వరుసలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, పార్టీ ఎం పీలు, ఎమ్మెల్యేలు ఆసీనులు కానున్నారు. మి గిలిన రెండు వరుసల్లో సుమారు 250 మంది ఆహ్వానితులు కూర్చునే విధంగా ఏర్పాట్లుచేశారు. సభావేదిక వెనుక భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ఏర్పాటు చేశారు. సభ చివర స్థానంలో కూర్చున్న వారి కి కూడా పసంగాలు వినిపించేలా.. ఏర్పాట్లు చేశారు. అధునాతనంగా అందుబాటులోకి వచ్చిన లైటింగ్‌ సిస్టంను వినియోగించారు.

2గంటలపాటు పవన్‌ ప్రసంగం

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేరుగా అమరావతి నుంచి మధ్యా హ్నం 3.45 గంటలకు చిత్రాడ సభా ప్రాంగ ణం సమీపంలోని హెలీప్యాడ్‌లో దిగనున్నా రు. సభా వేదికకు 500 మీటర్ల దూరంలోనే హెలిప్యాడ్‌ను నిర్మించారు. పవన్‌ దాదాపు రెండు గంటలకుపైగా ప్రసంగించే అవకాశం ఉంది. ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలిపేందుకు థాంక్యూ పిఠాపురం చెప్పుకుందాం! అనే నినాదంతో ఈ సభ జరగనున్నది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభమై రాత్రి పది వరకు జరుగుతాయి. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు, ఆడియో, వీడియో ప్రజెంటేషన్లు, ముఖ్య నేతల ప్రసంగాలు, చివరగా పవన్‌ ప్రసంగం ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *