రాష్ట్రస్థాయిలో విద్యార్థి ప్రతిభ

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్ కి చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థి కౌటం అభిలాష్ ,హైదరాబాద్ దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో షాట్‌పుట్ విభాగంలో తృతీయ బహుమతి సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని గ్రామ సర్పంచ్ ఎలగొండ సంధ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మెన్ కోరుకొప్పుల కావ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. కృష్ణ , ప్రాథమిక పాఠశాలg ప్రధానోపాధ్యాయులు శ్రీలత, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధిక రాణి, మమత, ఉమ, రూప, రంజిత్ కుమార్, రఫీ, రవీందర్, శ్రీనివాస్, యోగి , రామకృష్ణ, సునీత, అనిల్, శ్రీనివాస్ ,మౌనిక, పాల్గొన్నారు.

Leave a Reply