గ్రామ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండలంలోని శివన్నగూడ, సరంపేట గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘం (వివో) భవన నిర్మాణానికి బుధవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సరంపేట గ్రామ సర్పంచ్ నక్క రాములమ్మరవి ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి, వారు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం వెంకట్, ఏఇ హరీష్, పంచాయతీ కార్యదర్శి రాకేష్, ఫీల్డ్ అసిస్టెంట్ సల్వోజ్ యాదయ్య, వార్డు సభ్యులు కత్తుల శివరాణి, నక్క వెంకటేష్, పసుపుల కవిత, మహిళ సంఘం బంధం అధ్యక్షులు పోకల ప్రశాంతి, సభ్యులు నక్క సిరియాల, ఆడెపు రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
