40db| హ‌ద్దు పద్దు లేదా..?

40db| హ‌ద్దు పద్దు లేదా..?

40db| హ‌డ‌లెత్తిస్తున్న హార‌న్ సౌండ్లు
ద‌డ‌పుట్టిస్తున్న డీజే శ‌బ్ధాలు
చెవులు మూసుకుంటున్న జ‌నం
పెద్ద శబ్దాలతో రోగులు, ప్రజలకు ఇబ్బందులు

40db
40db

అవుకు రూరల్, ఆంధ్రప్రభ : ప్ర‌కృతిలో కోయిలమ్మ కుహు కుహు రాగాలు… చిలకమ్మా కిలకిల రాగాలు.. పిచ్చుకలు,పక్షుల సందడి సెలయేల్ల పరవళ్ళు సరిగమపదనిసల వంటివి సంగీత ఝరికి పునాదులు.ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పంచే ఈ సరదాలు ప్రస్తుత కాలంలో కనుమరుగయ్యాయి. ఢమా,ఢమా అంటూ బుల్లెట్ల బండ్లు వీధిలోకి అడుగు పెట్టగానే గుండె దడ దడ దడఅని దద్దరిల్లుతోంది. ఇంకేముంది కాస్త సైలెన్సర్ తీసేస్తే ఆ శబ్దమే వేరబ్బా… పలు రకాల శబ్దాలు జనాల్ని ఉరుకులు,పరుగులు పెట్టిస్తుంది. ఇళ్లల్లో ఏదేని పని చేసే సమయంలో పొరపాటున చేతిలో ఉన్న ఏదైనా స్టీల్ వస్తువు జారి కింద పడితే అసహనానికి గురవుతాం.. వివిధ రకాలైన శబ్దాలు పరిమితికి మించి చెవిని తాకడాన్ని శబ్ద కాలుష్యం అంటారు.శబ్ద కాలుష్యం మానవ శారీరక మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

శబ్ద కాలుష్యం వల్ల నష్టాలు
శబ్ద కాలుష్యం వల్ల వినికిడి లోపం,అధిక రక్తపోటు గుండెజబ్బులు,నిద్రలేమి తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏకాగ్రత లోపం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఈ అవాంఛిత ధ్వని శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ దీర్ఘకాలంలో గుండెపోటు,బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలను దారితీస్తుందని అధ్యయనాలు,వైద్యులు చెబుతున్నారు. భారతదేశంలో శబ్ద కాలుష్యాన్ని నిరోధించడానికి రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వాడకంపై నిషేధం ఉన్నట్లు తెలుస్తుంది. లౌడ్ స్పీకర్లు,వాహనాల హారన్ల శబ్దాలు 16 నుండి 40 డెసీబుల్స్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే కర్ణభేరి దెబ్బతినే ప్రమామున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.80,90 డిబి ఉంటే వినికిడి లోపంతో పాటు కర్ణభేరి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

డీజేల శబ్దాలతో మరింత ప్రమాదం
రకరకాల ఫంక్షన్లకు ఉత్సవాలకు డీజేల ఏర్పాటు నేటి తరం ఫ్యాషన్గా పరిగణిస్తోంది.ఈ డీజేల వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో డీజే శబ్దాలు కొంతమంది పాలిట మృత్యు శబ్దాలుగా మారి ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.వేడుకల్లో డీజేలను అరికట్టాలని పలువురు ప్రజలు, వైద్యులు కోరుతున్నారు.

ఆస్పత్రులు,పాఠశాలల వద్ద శబ్దాలు
పాఠశాలలు ఆస్పత్రుల వద్ద 20 30 డిసిబుల్స్ శబ్దం చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. ఆసుపత్రులలో వివిధ రోగాలతో బాధపడుతూ చికిత్స తీసుకునే రోగులు ఉంటారు.విపరీతమైన శబ్దాలు చేయడం వల్ల అధిక రక్తపోటు,గుండె జబ్బులు,తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన సెంటర్లలో భారీ శబ్దాలు
అవుకు పట్టణంలోని ప్రధాన సెంటర్ లైన తేరు సెంటర్ బస్టాండ్ ప్రాంతాలలో కొంతమంది ఆకతాయిలు మితిమీరిన బైక్ శబ్దాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాక పెళ్లిళ్ల సీజన్లో ఈ ప్రధాన కూడళ్ల వద్ద అర్ధరాత్రి సమయాల్లో డీజేల శబ్దాలతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పెద్ద శబ్దాలు వింటే కర్ణభేరి దెబ్బతింటుంది
డాక్టర్ అభినయ్,ప్రభుత్వ వైద్యులు, అవుకు

శబ్దాలు 16 నుండి 40 డెసిబుల్స్ మాత్రమే ఉండాలి.అంతకన్నా ఎక్కువ ఉంటే కర్ణభేరి దెబ్బతింటుంది.100- 120 డెసిబుల్స్ శబ్దం వింటే చెవి లోపల ఉండే పొరలో రంధ్రం పడి కర్ణభేరి దెబ్బతిని వినికిడి లోపం వస్తుంది.డీజేలు, ఎక్కువ శబ్దాలు చేసే వాహనాల శబ్దాలు చాలా ప్రమాదకరం.మరి కొంతమంది ఇయర్ ఫోన్స్ వాడే సమయంలో 40,50 శాతం కంటే శబ్దం వినకూడదని ప్రభుత్వ వైద్యులు అభినయ్ సూచిస్తున్నారు.ఎక్కువ శబ్దాలు చేసే హారన్లను, డీజేలను నియంత్రించాలని అధికారులను వైద్యులు అభినయ్ కోరుతున్నారు.

Leave a Reply