పశ్చిమ పనులపై కూటమి నాయకుల సమీక్ష..

భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజక వర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి పై ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సమీక్ష జరిగింది. వివిధ డివిజన్ల చెందిన కూటమి కార్పొరేటర్లు, నాయకులు కార్పొరేషన్ ఇంజనీరింగ్, విభాగం అధికారులతో ముఖాముఖి నిర్వహించారు.. ఆయా డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి పై వివరాలను అధికారులు వెల్లడించారు.. వెస్ట్ ను బెస్ట్ చేయాలనే ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆశయం లో ప్రతి ఒక్కరు భాగస్తులు కావాలని అధికారులను కూటమి నాయకులు కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారం త్వరితగతిన అయ్యేలా చూడాలని పలువురు సూచించారు.. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఈఈ శ్రీనివాస్, సుజనా ఫౌండేషన్ ప్రతినిధి ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, అప్పాజీ , రాజేష్, పెదబాబు, కూటమి నాయకులు మైలవరపు దుర్గారావు , మైలవరపు కృష్ణ , బొడ్డు నాగలక్ష్మి.. ఏధూపాటి రామయ్య, సుజనా మిత్ర లు, పాల్గొన్నారు..

Leave a Reply