కొత్త ఢిల్లీ – దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ పగబట్టింది అని విమర్శలు గుప్పించారు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . డీలిమిటేషన్తో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతోంది అన్నారు. ఈ నెల 22వ తేదీన చెన్నైలో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ కు తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమొళి, రాజాలు ఆహ్వానించారు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ ను డిఎంకె బృందం ఆయనను నేడు కలిసింది.. ఈ సందర్బంగా డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం గురించి నేతలు రేవంత్ కు వివరించారు.. పార్టీలతో సంబంధం లేకుండా డిలిమిటేషన్ వ్యతిరేకంగా అందరూ స్పందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీంతో ఏకీభవించిన రేవంత్ ఈ నెల 22న డిఎంకె ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతానని చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం మాట్లాడుతూ.. డిలిమిటేషన్ ముందుగా స్పందించాల్సింది దక్షిణ భారత దేశం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులేనని అన్నారు.. అలాగే కేంద్రం చర్యలపై తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించాలి అని డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నానని అన్నారు. బిజెపి ఎప్పుడు అధికారంలోకి వచ్చిన దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం చేస్తుంటుందని రేవంత్ ఫైర్ అయ్యారు.. దేశ జిడిపిలో అత్యధిక షేర్ దక్షిణాది నుంచి వస్తున్నా, నిధులు మాత్రం కేంద్రం నుంచి కేటాయింపులు జరగడం లేదన్నారు.. స్థానిక అవసరాల కోసం ప్రాజెక్ట్ లకు సహాయం చేయకపోగా , కనీసం అనుమతులు కూడా ఇవ్వడం లేదన్నారు.. నార్త్ వాళ్లకు బుల్లెట్ ట్రైన్స్, మెట్రో రైళ్లు ఇస్తారని, దక్షిణాదికి మాత్రం మొండి చేయి చూపుతారని మండిపడ్డారు.