public | ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

public | ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి మాట్లాడుతున్న పిఓ
ఉట్నూర్ ఐటీడీఏ పివో యువరాజ్ మార్మాట్

public | ఉట్నూర్, ఆంధ్రప్రభః అదిలాబాద్ ఉట్నూర్ ఐటీడీఏలో ప్రతీ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ పివో యువరాజ్ మార్మాట్ అన్నారు. కార్యాలయం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.


జైనూర్ మండలం గారింగగూడ గ్రామానికి చెందిన గ్రామ ప్రజలు తమ గ్రామానికి త్రిఫెజ్ విద్యుత్ మంజూరు కల్పించామని, ఇంద్రవెల్లి మండలం కొలంగూడ గ్రామానికి చెందిన ముక్తా వ్యవసాయం లో విద్యుత్ కనెక్షన్ అందించాలని కోరారు. గాదిగూడ మండలం జరి గ్రామానికి చెందిన జంగు ఆర్థిక సహాయం అర్జీ కోరారు,వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధిం చిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఈకార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply