Humanity | మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్

Humanity | మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్
Humanity |మంథని ఆంధ్ర ప్రభ: కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్ ఆపదలో ఉన్న వారికి సాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. ఆదివారం వరంగల్ వెళ్లి మంథని కి వస్తున్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జ్ కిరణ్ గౌడ్ వెంకటాపూర్ క్రాసింగ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు డివైడర్ ను ఢీకొని గాయాలతో ఉండగా వెంటనే అటుగా వస్తున్న అంబులెన్స్ ఆపి మంథని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం పోలీస్ వారి సహకారంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
