15th Police | ట్రాఫిక్ మళ్లింపు…

15th Police | ట్రాఫిక్ మళ్లింపు…

15th Police | పమిడిముక్కల – ఆంధ్రప్రభ : విజయవాడ – అవనిగడ్డ కరకట్ట మీదుగా ప్రయాణించే వాహన చోదకులకు పోలీసు హెచ్చరికలు జారీ చేశారు. శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని 15న ట్రాఫిక్ మళ్లించినట్లు పమిడిముక్కల సీఐ చిట్టిబాబు తెలిపారు.

అవనిగడ్డ నుంచి విజయవాడ వైపు వెళ్ళు బస్సులు, లారీలు లంకపల్లి మీదుగా చోరగుడి, కృష్ణాపురం, మంటాడ, వుయ్యూరు, తోట్లవల్లూరు మీదుగా విజయవాడ వరకు, విజయవాడ – అవనిగడ్డ వైపు వెళ్లే వాహనాలు తోట్లవల్లూరు, ఉయ్యూరు, మంటాడ, కృష్ణాపురం, చోరగుడి, లంకపల్లి మీదుగా అవనిగడ్డ వాహనాలు వెళ్తాయని తెలిపారు. అవనిగడ్డ వైపు నుంచి ఆలయమునకు వచ్చు భక్తుల కార్లు, ఐనపూరు, కూడేరు మీదుగా ఐలూరు, అవనిగడ్డ వైపు నుంచి ఆలయమునకు వచ్చు భక్తుల ద్వి చక్ర వాహణములకు ఐలూరు వాటర్ టాంక్ వద్ద పార్కింగ్ ఉంటుందని తెలిపారు. విజయవాడ నుంచి ఆలయమునకు వచ్చు భక్తుల కార్లు దేవరపల్లి మీదుగా ఐలూరు చేరుకుని దేవరపల్లి – ఐలూరు రోడ్డులో పార్కింగ్ చేయటం జరుగుతుందన్నారు.

Leave a Reply