Twist | బెయిల్ వ‌చ్చినా జైలులోనే పోసాని…

క‌ర్నూలు – సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ అయిన కేసుల‌లో ఆయా కోర్టులు బెయిల్ మంజూరు చేసిన జైలులోనే ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.. ఆయ‌న క‌ర్నూలు జైలు ఉంచి బ‌య‌ట‌కు రాగానే అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు వేసిన పీటీ వారెంట్ తో సిద్ధంగా ఉన్నారు. దీంతో సిఐడి పిటి వారెంట్ పై ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. పోసాని తరపున వైసీపీ రాష్ట్ర లీగల్ వ్యవహారాల కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కోర్టు విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

Leave a Reply