AP | వృద్ధురాలు ఆత్మహత్య …

AP | వృద్ధురాలు ఆత్మహత్య …

AP | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా లోని ఉరవకొండ మండలంలోని రేణుమాకులపల్లిలో కడుపు నొప్పితో బాధపడుతూ పలు అనారోగ్య కారణాల‌చేత వృద్ధ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘ‌ట‌న‌ రేణుమాకులపల్లిలో ఈరోజు చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేణుమాకుల పల్లి గ్రామానికి చెందిన బోయ లక్ష్మీదేవి ( 65 ) అనే వృద్ధురాలు కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది. జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరులేని సమయం చూసి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply