AP | నిరంతరాయంగా డీసిల్టింగ్ పనులు జరుగుతూ ఉండాలి..

AP | నిరంతరాయంగా డీసిల్టింగ్ పనులు జరుగుతూ ఉండాలి..
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
AP | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలో నిరంతరాయంగా డీసిల్టింగ్ పనులు జరుగుతూ ఉండాని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్ నైజాం గేట్, కేఎల్ రావు ఔటఫాల్ డ్రైన్, ఊర్మిళ సుబ్బారావు నగర్ ఔటఫాల్ డ్రైన్, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నైజాం గేట్ ఔటఫాల్ డ్రైన్ వద్ద పేరుకుపోయిన వ్యర్ధాలను చూసి, డిసిల్టింగ్ పనులు ఎందుకు చేయటం లేదని అక్కడ ఉన్న సిబ్బందిని అడగగా వారు ఎక్స్కలేటర్ మరమ్మతులో ఉండటం వలన చేయలేకపోతున్నామని తెలుపారు. పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఏ వాహనమైన త్వరగా మరమ్మతులు చేయించి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని, మరమ్మతులకు ఆలస్యం అవరాదని, ఇంజనీరింగ్ పై ఆగ్రహించారు. ఊర్మిళ సుబ్బారావు నగర్ ఔటఫాల్ డ్రైన్ డిసిల్టింగ్ పనులు పూర్తయ్యాయా లేదా అని పరిశీలించేందుకు అక్కడ రోడ్డు లేకపోవడంతో డ్రోన్ ద్వారా పరిశీలించి మిగిలిన డీసిల్టింగ్ పనులను పూర్తిగా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న ఔటఫాల్ డ్రైన్ లలో నిరంతరాయంగా డీసిల్టింగ్ పనులను చేస్తుండాలని, డీసిల్టింగ్ చేసే ప్రక్రియలో మెషిన్లు పాడైపోయినచో వెంటనే వాటిని మరమ్మతులు చేయించి త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చి డీసెల్టింగ్ ప్రక్రియకు ఏ మాత్రం భంగం కలిగించరాదని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి డీసిల్టింగ్ పనులను త్వరగా పూర్తిచేసే ఔట్ఫాల్ట్ డ్రైన్ లలో ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన సిల్ట్లను తొలగించాలని అన్నారు. తదుపరి హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ లో లోపం ఉండరాదని త్రాగునీరు వాడుక నీటి సరఫరా లో అంతరాయం ఉండరాదని ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


