Right to Vote |ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు..

Right to Vote | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ లో పరిధిలోని 7వ వార్డు లోని 17వ బూతులో మక్తల్ మాజీ ఎంపిపి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన తమ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని అన్నారు. అవినీతి బంధుప్రీతి కి దూరంగా అభివృద్ధిని ఆశిస్తూ నీతి వంతమైన పాలన కోసం ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు .ఈ ఎన్నికల్లో మక్తల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పట్టణ ప్రజలు ఓటు వేస్తున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి మక్తల్ మున్సిపాలిటీ పై కమలం జెండా ఎగరడం ఖాయమని కొండయ్య ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply