హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
ఉదయం 11గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ శర్మ ప్రసంగం ఉంటుంది. దాదాపు గంటపాటు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. అనంతరం మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. ఈనెల 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు వారాలపాటు అంటే ఈనెల 27 వరకు సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు ఇతర బిల్లులు కూడా అసెంబ్లీ, కౌన్సిల్ ముందుకు రానున్నాయి. పలు అంశాలు కూడా బడ్జెట్ సమావేవాల్లో చర్చకు రానున్నాయి.ఇక అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్నిచర్యలు తీసుకుంటున్నారు.
ఆందోళనకారులు ఎవరు కూడా అసెంబ్లీ సరిసరాల్లోకి రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అసెంబ్లీ సమావేశాలు సక్రమంగా సాగేందుకు సభ్యులు లెవనెత్తే అంశాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేటట్లు చూడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అసెంబ్లీ కి కేసీఆర్
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలోనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని ప్రచారం జరుగుతోంది. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పట్టు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని, తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే.. తాను కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్లు తెలిపారట.