హైదరాబాద్ ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన బుధవారం కాంగ్రెస్ శాసనసభా సమావేశం జరగనుంది. మధ్యాహ్నాం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలు-1లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. 2025-26 బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ సభ్యులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
1,532 మంది అధ్యాపకులకు నేడు నియామక పత్రాలు
విద్యాశాఖలో నూతనంగా ఎంపికైన 1,532 మంది అధ్యాపకులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియామక పత్రాలను అందించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో బుధవారం మధ్యాహ్నం 12.30గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. కొత్తగా ఎంపికైన వారిలో ఇంటర్మీడియట్ విద్యలో జూనియర్ లెక్చరర్లుగా 1,292 మందికి (పురుషులు-794, మహిళలు-498), పాలిటెక్నిక్ కళాశాలలో బోధించేందుకు 240 మందికి (పురుషులు-177, మహిళలు-63) నియామకపత్రాలను అందిస్తారు.