- నోటిఫికేషన్ జారీ చేసిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్
ప్రజాగాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సినీ అవార్డులకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ (తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎంట్రీలను ఆహ్వానించింది. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ సినీ రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2014 నుండి 2023 వరకు అప్పటి తెలంగాణా ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను జారీ చేయకపోవడంతో, ఆ సంవత్సరాలకు కూడా ఒక్కో సంవత్సరానికి ఒక ఉత్తమ చలన చిత్రానికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు.
గద్దర్ చలన చిత్ర అవార్డులకు దరఖాస్తులు గురువారం నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
అవార్డులు.. కేటగిరిలు ఇలా..
ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై చలన చిత్రం, బాలల చలన చిత్రం. పర్యావరణం/హెరిటేజ్/చరిత్రలపై చలన చిత్రం. డెబ్యూట్ ఫీచర్ ఫిల్మ్స్. యానిమేషన్ ఫిలిం. స్పెషల్ ఎఫెక్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ ఫిలిం.