19th Ward | ఆదరించి గెలిపించండి..

19th Ward | ఆదరించి గెలిపించండి..
19th Ward | కల్లూరు, ఆంధ్రప్రభ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు టిఆర్ఎస్ 19 వ వార్డు అభ్యర్థిని గా బరిలో ఉన్నానని ఆదరించి గెలిపించుకోవాలని 19వ వార్డ్ అభ్యర్థి ని కంభంపాటి స్వరూప కోరారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రభ తో మాట్లాడారు. కల్లూరు మున్సిపాలిటీ గా ఏర్పడిన తొలి దశలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని, ప్రజలు ఆదరించి గెలిపించుకుంటే మున్సిపాలిటీలో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు.
19వ వార్డును అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఆమె అన్నారు. నేడు జరిగే మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుపై తమ ఆమూల్యమైన ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మరల అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుపై ఓట్లు వేసి ఆదరించి గెలిపించాలని ఆమె కోరారు.
