బర్మింగామ్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ బ్యాట్మింటన్ స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్ శుభారంభం చేశాడు. ఈరోజు (మంగళవారం) జరిగిన తొలి రౌండ్‌లో తైవాన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సు-లియాంగ్ పై గెలుపొంది ప్రీ-క్వార్టర్స్ కు చేరుకున్నాడు సేన్.
ఈ మ్యాచ్ తొలి సెట్‌లో తైవాన్ ఆటగాడు.. లక్ష్య సేన్ పై ఆధిపత్యం చెలాయించాడు. తొలి సెట్‌ను 21-13తో గెలుచుకున్నాడు సు-లియాంగ్. అయితే, ఆ తర్వాతి సెట్లలో కోలుకున్న లక్ష్య సేన్ 21-17, 12-15తో వరుస సెట్లను దక్కించుకుని ప్రత్యర్థి ప్లేయర్ ను ఓడించాడు. దీంతో తొలి రౌండ్ లో విజయం సాధించిన లక్ష్య సేన్ ప్రీ క్వార్టర్స్ లోకి అడుగుపెట్టాడు.
ప్రణయ్ ఔట్
అంతకముందు జరిగిన పురుషుల సింగిల్స్ లో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. తొలి రౌండ్‌లో.. ఫ్రాన్స్‌కు చెందిన టోమా పోవోవ్‌తో తలపడిన ప్రణయ్, వరుస గేమ్‌లలో 19-21, 16-21 తేడాతో ఓడిపోయాడు. దీంతో, ఇంగ్లాండ్ ఓపెన్ తొలి రౌండ్ నుంచి ప్రణయ్ ఇంటిముఖం పట్టాడు.